జెనీవా: భారతదేశంలో మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి , జర్నలిస్టుల నిర్బంధం పట్ల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషనర్ కార్యాలయం బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ''దాడులు, అరెస్టులు , నిర్బంధాలు, జప్తులు జరుగుతున్నట్లు వచ్చిన వార్తలు మమ్మల్ని ఎంతగానో బాధించాయని ఐరాస మానవ హక్కుల కమిషనర్ పేర్కొన్నారు. మంగళవారం న్యూస్‌క్లిక్‌పై జరిగిన దాడులపై స్పందిస్తూ జర్నలిస్టుల భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని, వైర్‌తో ఆయన అన్నారు. న్యూస్‌క్లిక్‌లో పని చేస్తున్న అనేక మంది వ్యక్తులను నిర్బంధించడం దిగ్భ్రాంతిని కలిగించిందని జెనీవాలోని మీడియా విశ్లేషకులొకరు తెలిపారు.
ఈ సమయంలో పోలీసులు డజన్ల కొద్దీ జర్నలిస్టుల ఇ- ఎలక్ట్రానిక్ పరికరాలను - ల్యాప్‌టాప్‌లు , టెలిఫోన్‌లను స్వాధీనం చేసుకోవడం భారతదేశంలో సర్వసాధారణంగా అనిపించింది. పైగా, జర్నలిస్టులను టెర్రరిస్టులుగా పరిగణించడం వంటి ఆరోపించిన క్రూరమైన %ఖAూA% కింద వారిపై అభియోగాలు మోపడం, ''ప్రజాస్వామ్యానికి తల్లి'' అని గర్వించుకునే భారతదేశానికి శ్రేయస్కరం కాదని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.