గ్లాస్గో : భారత్ దౌత్యవేత్తను అడ్డుకున్న రాడికల్ సిక్కుల తీరును లండన్‌లోని గురుద్వారా ఆదివారం తీవ్రంగా ఖండించింది. భారత్ హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామిని రాడికల్ సిక్కు గ్రూపులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అన్ని కమ్యూనిటీలు, వ్యక్తులను గురుద్వారా అనుమతిస్తుందని పేర్కొంది. గుర్తుతెలియని వ్యక్తుల క్రమశిక్షణా రాహిత్య చర్యను పూర్తిగా ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 2003, సెప్టెంబర్ 29న గ్లాస్గో గురుద్వారాలో భారత దౌత్యవేత్తను కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు గ్లాస్గో గురుద్వారాలోకి రానీయకుండా అడ్డుకున్నారు. దీంతో వారు గురుద్వారా ప్రాంగణం నుండి వెనుతిరగాలని నిర్ణయించుకున్నారని గ్లాస్గో గురుద్వారా గురు గ్రంథ్ సాహిబ్ సిక్కు సభ ఆ ప్రకటనలో పేర్కొంది. భారత రాయబారి వెళ్లిపోయిన అనంతరం కూడా ఆ వ్యక్తులు భంగం కలిగిస్తూనే ఉన్నారని గురుద్వారా తెలిపింది. సిక్కు ప్రార్థనా స్థలమైన గురుద్వారా యొక్క శాంతియుత కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ఇటువంటి క్రమశిక్షణా రాహిత్య తీవ్రంగా ఖండిస్తుందని ఆ ప్రకటన పేర్కొంది.