Aug 29,2023 16:04

న్యూఢిల్లీ :  ఇస్లామాబాద్‌లోని హైకమిషన్‌ కార్యాలయంలో భారత చార్జ్‌ డి'అఫైర్స్‌గా (దౌత్య మిషన్‌ తాత్కాలిక చీఫ్‌)గా గీతికా శ్రీవాస్తవ నియమితులయ్యారు. ఈ బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళగా ఆమె నిలిచారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. డా.ఎం. సురేష్‌ కుమార్‌ న్యూఢిల్లీకి తిరిగి రావడంతో ఆమె ఈ పదవికి ఎన్నికయ్యారు. 2005 ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ బ్యాచ్‌కి చెందిన గీతికా శ్రీవాస్తవ ప్రస్తుతం ఇండో-ఫసిపిక్‌ డివిజన్‌లో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ (ఎంఇఎ) శాఖ జాయింట్‌ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఆమె 2007 నుండి 2009 వరకు చైనాలోని భారత హైకమిషన్‌లో పనిచేశారు.

ఇండియా, పాకిస్తాన్‌ మిషన్స్‌ న్యూఢిల్లీ మరియు ఇస్లామాబాద్‌లోని ఇండియా, పాకిస్తాన్‌ మిషన్‌లు 2019 నుండి హై కమిషనర్లు లేకుండా .. చార్జ్‌ డి అఫైర్స్‌ నేతృత్వంలో నడస్తున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పాకిస్తాన్‌ హై క మిషన్‌ హోదాను తగ్గించడానికి ముందు ఇస్లామాబాద్‌లోని చివరి భారతీయ హైకమిషనర్‌గా అజరు బిసారి వ్యవహరించారు.