Nov 05,2023 12:32

ఒట్టావా :   ఖలిస్తానీ వేర్పాటువాద నేత నిజ్జర్‌ హత్య ఆరోపణలపై కెనడా ప్రభుత్వం ఆధారాలు చూపాలని భారత రాయబారి సంజయ: కుమార్‌ వర్మ పేర్కొన్నారు. కెనడాతో దౌత్య సంబంధాల ప్రతిష్టంభనపై భారత వైఖరిని పునరుద్ఘాటించారు. భారత రాయబారి సంజయ: కుమార్‌ వర్మ అంతర్జాతీయ మీడియా గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌తో మాట్లాడారు.  నిజ్జర్‌ హత్యలో భారతదేశ ప్రమేయం ఉందని ఆరోపించిన కెనడా, దాని మిత్ర దేశాలు  ఆధారాలు చూపించలేదని  స్పష్టం చేశారు.  ఈ కేసు దర్యాప్తులో వారికి సహాయం చేయడానికి మాకు నిర్దిష్ట లేదా సంబంధిత సమాచారం అందించలేదు. '' సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి. విచారణ ముగింపు ఏమిటి. నేను ఒక అడుగు ముందుకు వేసి వెల్లడిస్తున్నాను. ఈ దర్యప్తు మొత్తాన్ని తారుమారు చేశారు '' అని అన్నారు. ''
ఈ హత్యలో భారత ఏజెంట్లు ఉన్నట్లు చెప్పాలని కెనడాలోని అత్యున్నత స్థాయి అధికారుల నుండి సూచనలు వచ్చాయని అన్నారు. తనకు బెదిరింపులు వచ్చాయని .. దీంతో తనకు రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌ (ఆర్‌సిఎంపి) భద్రత కల్పించినట్లు వర్మ వెల్లడించారు. తన సహచర దౌత్యవేత్తలకు కెనడాలో ముప్పు పొంచి ఉందని అన్నారు.