ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ఆర్మీ బేస్‌పై శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. సైన్యం కాల్పుల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులు మరణించినట్లు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పిఆర్) వెల్లడించింది. ఈ ఘటనలో మూడు యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు తెలిపారు.
ఐఎస్‌పిఆర్ ప్రకారం.. పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్వాలి శిక్షణా ఎయిర్ బేస్‌పై శనివారం తెల్లవారుజామున సుమారు తొమ్మిది మంది ఉగ్రవాదులు దాడికి దిగారు. అయితే అప్రమత్తమైన సైన్యం ఈ దాడిని వెంటనే తిప్పి కొట్టింది. వారంతా మరణించినట్లు ఐఎస్‌పిఆర్ తెలిపింది. ఈ ఉగ్రదాడికి తమదే బాధ్యత అని తెహ్రీక్-ఇ-జిహాద్ ప్రకటించినట్లు పాకిస్తాన్ మీడియా ప్రతినిధి ప్రకటించారు.
గతవారం పాకిస్తాన్ ఖైబర్ ఫక్తుంక్వాలోని సైనిక శిబిరంపై రెండు వేర్వేరు దాడులు జరిపినట్లు ఐఎస్‌పిఆర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో ఒక ఉగ్రవాది మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దక్షిణ వజైరిస్తాన్ ప్రాంతంలో ఎల్‌ఇడి పేలుడంతో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.