ప్రజాశక్తి-రెడ్డిగూడెం : ఉదయగిరి చారిటబుల్ ట్రస్ట్ - నూజివీడు వారిచే రెడ్డిగూడెం "ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ" స్వచ్ఛంద సేవా సంస్థ డే కేర్ సెంటర్ నందు నిరుపేదలైన వారికి శనివారం నాడు 'ప్రేమవిందు' (అన్నదానం) జరిగింది. ఈ సందర్భంగా ఉదయగిరి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ఉదయగిరి కృపారావు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన తమ ట్రస్టు ద్వారా కరోన లాక్ డౌన్ సమయంలో పేదలకు ఆహారం, ఆహార పదార్థాలు, మంచినీరు సరఫరా చేశామని తెలిపారు. అలాగే గత 30 శనివారాలు పేదలకు అన్నదానం చేయడమే కాకుండా దుప్పట్లు, చీరలు పంపిణీ చేశామని చర్చీలలో తెలుగు బైబిల్స్ పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో "ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ" స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు చాట్ల విజయ్ కుమార్, ఉదయగిరి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ప్రొద్దుటూరు కిరణ్, ఉదయగిరి సందీప్,రోహిత్, కొప్పుల రాజేంద్ర, ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ గౌరవ అధ్యక్షురాలు సి హెచ్ శారమ్మ, తదితరులు పాల్గొన్నారు.










