Sep 10,2022 11:33

ఏలూరు : ఎగువ నుండి చేరుతోన్న వరద నీటితో ప.గో. జంగారెడ్డిగూడెం కొంగవారిగూడెం ఎర్రకాల్వ జలాశయానికి వరద పోటెత్తింది. శనివారం రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.19 మీటర్లకు చేరింది. ప్రాజెక్ట్‌ లోకి 4500-క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్ట్‌ రెండు గేట్లను ఎత్తి 2500 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 4.428 టి.ఎం.సి.లుగా ఉంది.