Apr 02,2023 10:11

జంగారెడ్డిగూడెం (ఏలూరు) : కుటుంబంపై దుండగులు కత్తులతో దాడి చేసిన ఘటన ఆదివారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో జరిగింది. గ్రామంలోని ఒకే కుటుంబీకులైన భార్య, భర్త, కొడుకులపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఇంటివద్ద ఉన్న చిన్ని (25), తోణం మంగరాజు (11), పొగాకు బేరన్‌ వద్ద ఉన్న తోణం శివ (28) ల పై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్నవారిని స్థానికుల సాయంతో వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. భూ తగాదాలే కారణమైయుండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.