ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రైతులు పొలాలకు నీరు పెట్టుకునేందుకు మంగళం వాగులో తీసిన నీటి గుంటలో పడి నరసరావుపేట మండలంలోని గోనెపూడి గ్రామానికి చెందిన వెలుగు మణికంఠ (11) వెలుగు నవీన్ (9) లు శుక్రవారం మృతి చెందారు. తోటి పిల్లలతో కలిసి సరదాగా ఆడుకునేందుకు అటు వైపు వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందారు. చిన్నారులు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 6 తరగతి, 4వ తరగతి చదువుతున్నారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు వెలుగు చెంచయ్య, కోటేశ్వరమ్మ కుటుంబ సభ్యులు చిన్నారుల మృత దేహాలపై పడి విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది.