న్యూఢిల్లీ : తృణమూల్ ఎంపి డెరెక్ ఒబ్రియెన్‌ను సస్పెండ్ చేసినట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ మంగళవారం ప్రకటించారు. ఈ పార్లమెంట్ సమావేశాల మొత్తానికి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించారని, చైర్మన్‌ను అగౌరవపట్టిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే .. ఓబ్రియెన్‌ను సస్పెండ్ చేయాలంటూ రాజ్యసభా పక్ష నేత పీయూష్ గోయల్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై చైర్మన్ ఓటింగ్ నిర్వహించారు. అనంతరం ఓబ్రియెన్‌ను ఈ సీజన్ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఓబ్రియెన్ ప్రసంగం నుంచి కొన్ని వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి కూడా తొలగించినట్లు సమాచారం. రాజ్యసభ ఆప్ ఎంపి సంజరు కుమార్ సింగ్‌పై కూడా వేటు పడిన సంగతి తెలిసిందే.