Oct 29,2023 11:17

న్యూఢిల్లీ :   కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యలపై తృణమూల్‌ ఎంపి మహువా మొయిత్రా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.'' మొదట బిజెపి పార్లమెంటులో డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారని ఆరోపించింది. తప్పుడు ఆరోపణలకు ఆధారాలు లేకపోవడంతో .. ఇప్పుడు జాతీయ భద్రత అంశాన్ని లేవనెత్తింది'' అని ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.
మహువా మొయిత్రా పార్లమెంటులో డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారంటూ బిజెపి ఎంపి నిషికాంత్‌ దూబే ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని, విచారణ జరిపి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై టిఎంసి ఎంపి మహువా పై విధంగా స్పందించారు.