కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా పోరాటానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మద్దతు పలికారు. ఆమె రాజకీయ బాధితురాలని, అయితే ఆమెకి ఒంటరిగా పోరాడే శక్తి ఉందని అన్నారు. టిఎంసి నేతలను బిజెపి లక్ష్యంగా చేసుకుంటోందని ధ్వజమెత్తారు. ఆమెపై సిబిఐ విచారణకు ఆదేశించడాన్ని కేంద్ర ప్రభుత్వపు చర్యగా భావిస్తున్నట్లు తెలిపారు. '' నేను చదివిన ఎథిక్స్ కమిటీ నివేదిక ప్రకారం సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉందని చదివాను. విచారణకు ఆదేశించినపుడు.. ఆమెను బహిష్కరించాలని ఎందుకు సిఫారసు చేశారు. కొంతమంది రాజకీయాలకు ఆమె బాధితురాలు అయ్యారని, అయితే మహువాకు ఒంటరిగా పోరాడే శక్తి ఉంది. బిజెపి నన్ను కూడా నాలుగేళ్లుగా బాధిస్తూనే ఉంది. ఇది బిజెపి ప్రామాణిక పద్ధతి '' అని అన్నారు. అయితే మహువా విషయంలో టిఎంసి అధ్యక్షురాలు మమతా బెనర్జీ మౌనం వహించిన సంగతి తెలిసిందే.