సరంపల్లి అనే ఊరిలో కీర్తన, కీర్తి అనే అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వాళ్లు చాలా చురుకైన పిల్లలు. ఒక రోజు వాళ్ల అమ్మానాన్నలు పని కోసం పక్క ఊరికి వెళ్లారు. చీకటి పడటంతో ఆ రోజు వారు అక్కడే ఉండిపోయారు. ఆ రోజు రాత్రి వాళ్ల ఇంటికి ఓ దొంగ వచ్చాడు. ఇది గమనించిన కీర్తన వెంటనే చెల్లి కీర్తి చెవిలో 'ఇంట్లోకి దొంగ వచ్చాడు' అని చెప్పింది. అక్కాచెల్లెలిద్దరూ కలిసి దొంగను పట్టుకోవాలని ఒక ఉపాయం ఆలోచించారు. కీర్తన దొంగ కంట పడకుండా వంట గదిలోకి వెళ్లి ఎండుమిర్చి తీసుకుని పొయ్యిలో వేసి మంట పెట్టింది. కీర్తి శబ్దం రాకుండా తలుపు తీసి బయటకు వెళ్లింది. దొంగ బయటకు రాకుండా గడియపెట్టింది. దాంతో దొంగకు ఊపిరి ఆడక పెద్దగా దగ్గాడు. దాంతో చుట్టుపక్కల వారంతా చేరి దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కీర్తినకీర్తి తెలివి తేటలకు ఊరి ప్రజలు మెచ్చుకున్నారు.

- పి. జాహ్నవి,
5వ తరగతి,
జెడ్‌పిహెచ్ స్కూలు, ముదినేపల్లి.










