అనకాపల్లి : అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కడగడ్డ గ్రామంలో ఉల్లి వెంకటరావు(37) ఆరోగ్యం బాగో లేకపోవడంతో విశాఖ ఆస్పత్రిలో జాయిన్ చేశాను.వైద్యం పొందుతూ మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో రాజేంద్ర ప్రసాద్ వార్డులో మరణించారు. తన భార్య ఉల్లి ఎర్రమ్మ ఒకరే ఉన్నారు. ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు. కేజీహెచ్ ట్రైబల్ వార్డు వెళ్లి ఫిర్యాదు చేయగా, మాది అనకాపల్లి జిల్లా ట్రైబల్ ఏరియా కాదని సమాధానం చెప్పారు. ఈ విషయంపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ కి, సిసికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. నాన్ షెడ్యూల్ గిరిజనులు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే కేజీహెచ్ లో మరణిస్తే ఎవరికి చెప్పుకోవాలని తెలియని పరిస్థితిలో ఆదివాసులు ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నాన్ షెడ్యూల్ గిరిజనులు ప్రత్యేకంగా కేజీహెచ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి గిరిజనులకి మహాప్రస్థానం ఏర్పాటు చేయాలని కోరారు. లేకపోతే నాన్ షెడ్యూల్ గిరిజనులు ఐక్యంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామన్నారు. తక్షణమే అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు కే గోవిందరావు., నాయకులు రాంగ్ చంద్రియ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- స్పందించిన అల్లూరి సీతారామ జిల్లా అధికారులు
ఈ విషయంపై జిల్లా అధికారులకు తీసుకెళ్లడంతో పక్కనుండే అల్లూరి సీతారాముల జిల్లా అధికారులు స్పందించి, ఐటీడీఏ నుండి మహాప్రస్థానం ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు తెలిపారు.










