ప్రజాశక్తి-బుట్టాయిగూడెం : మార్చి 27న జరిగే గిరిజన సంఘం బహిరంగ సభను జయప్రదం చేయాలని గిరిజన సంఘం పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పడమటి రేగులకుంట గ్రామం సమావేశంలో గోడ పత్రికలను విడుదల చేయటం జరిగింది. ఈ సభ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు కొవ్వాసి దుర్గారావు అధ్యక్షతన జరిగింది. సభను ఉద్దేశించి సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ మార్చి 27వ తేదీన గిరిజన సంఘం బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని జీలుగుమిల్లి మండలంలోని కేంద్ర ప్రభుత్వం తుపాకుల ఫ్యాక్టరీని నిర్మాణానికి సర్వేలు నిర్వహిస్తున్నారని ఇది పూర్తిగా గిరిజన చట్టాలకు విరుద్ధంగా జరుగుతున్నాయని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధానికి గిరిజన భూమి కట్టబెట్టేందుకే ప్రయత్నాలు చేస్తున్నాయని దీని గిరిజన సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లోని తుపాకులు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటామని అన్నారు. గిరిజనులు సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలిస్తామని ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ చెప్పినప్పటికీ ఈరోజు కూడా సాగుదారు పట్టాలు అందలేదని వారన్నారు గిరిజనులు సాగులో ఉన్న LTR,1/70 చట్ట భూములకు కూడా సాగులో నమోదు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత సమస్యలు ప్రభుత్వాలు సత్వరమే పరిష్కారం చేయాలి రామకృష్ణ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా సర్వం కోల్పోయిన నిర్వాసితులకి పునరావాస కాలనీలోని కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయని ఈరోజుకి రోడ్లు డ్రైనేజీ స్మశాన వాటిక లాంటి సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. నిర్వాసితులకి ఇవ్వాల్సిన పునరావాస ప్యాకేజీ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1/70 చట్టాన్ని పట్టేష్టంగా అమలు చేయాలని వారు కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చట్టాన్ని ఉద్దేశపూర్వకంగానే తొలగించాలని ప్రయత్నంలో భాగంగా గిరిజన చట్టాలపై దాడి జరుగుతుందని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోను గిరిజన సంఘం సహించేది లేదని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు చోడం దుర్గారావు, భద్రం, పొట్ట జీ తెల్ల ప్రసాద్, నూపా చంద్రరావు మొదలగువారు పాల్గొన్నారు.










