Oct 13,2023 16:55

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం :  కపిలేశ్వరపురం మండలంలోని అంగర లో కమ్యూనిస్టు పార్టీ నాయకులు తోరాటి లక్ష్మణ మూర్తి 97వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక తోరాటి లక్ష్మణ మూర్తి విజ్ఞాన కేంద్రం వద్ద పలువురు స్మారక స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం గాంధీ సెంటర్లోని లక్ష్మణమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన లక్ష్మణమూర్తి అందరికీ ఆదర్శనీయమన్నారు. అనంతరం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ సిపిఎం నాయకులు జిత్తుక చిన్న వీర్రాజును, సాలువ కప్పి, పూలమాలతో ఘనంగా సన్మానించారు .కార్యక్రమంలో అంగర, పడమర ఖండ్రిక గ్రామాల సర్పంచులు వాసా కోటేశ్వరరావు, తిరునాతి వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ యర్ర వీరన్న బాబు, జిత్తుక మల్లికార్జునుడు, ముత్తా అబ్బు, పెద్దింశెట్టి వీరబాబు, పెద్దింశెట్టి రాంబాబు, యానాల సీతారామయ్య, సంకాబత్తుల స్వామి కాపు, అబ్బాస్, భవన నిర్మాణ కార్మికుల యూనియన్, ఆటో యూనియన్ నాయకులు ,తదితరులు, పాల్గొన్నారు.