Feb 03,2023 21:40
  • కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో గత ఐదేళ్లలో 28,572 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశుకు కేంద్ర మంత్రి శుక్రవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో 2017 నుంచి 2021 వరకు ఐదేళ్లలో 28,572 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎపిలో 2,413 మంది, తెలంగాణలో 3,055 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.

  • రైల్వేలో 3,14,924 పోస్టులు ఖాళీ

రైల్వేలో 3,14,924 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. రాజ్యసభలో అడిగిన ప్రశుకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రైల్వేలో 3,14,924 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో 3,12,039 నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు, 2,885 గెజిటెడ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. విజయవాడ డివిజన్‌లో 3,695, గుంతకల్లు డివిజన్‌లో 2,696, వాల్తేర్‌ డివిజన్‌లో 3,695, గుంటూరు డివిజన్‌లో 3,204, సికింద్రాబాద్‌ డివిజన్‌లో 3,218, హైదరాబాదులో 1,193 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.

  • 9,090 వెటర్నరీ డాక్టర్ల పోస్టులు ఖాళీ

దేశంలో 9,090 వెటర్నరీ డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశుకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో 2023 జనవరి 31 నాటికి 9,090 వెటరురీ డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 275, తెలంగాణలో 297 వెటరురీ డాక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.

  • విదేశీ జైళ్లలో 8,343 మంది

విదేశీ జైళ్లలో 8,343 మంది భారతీయులు మగ్గుతునాురనివిదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్‌ తెలిపారు. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశుకుకేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

  • ఎపిలో 1,82,375 నకిలీ రేషన్‌ కార్డులు

రాష్ట్రంలో 1,82,375 నకిలీ రేషన్‌ కార్డులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని కేంద్ర ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాలశాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్వోతి తెలిపారు. 2023 జనవరి 1 నాటికి తెలంగాణలో 77,874 నకిలీ రేషన్‌ కార్డులున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా 55,37,274 నకిలీ కార్డులున్నాయని తెలిపారు.

  • ఎపిలో 3,185 మంది చిన్నారులు అదృశ్యం

ఆంధ్రప్రదేశ్‌లో 3,185 మంది చిన్నారులు అదృశ్యమయ్యారని కేంద్ర శిశుసంక్షేమ, మహిళాశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020 జనవరి 1 నుంచి 2022 డిసెంబరు 31 మధ్య దేశంలో 1,46,316 మంది చిన్నారులు అదృశ్యమయ్యారని, తెలంగాణలో 1,260 మంది అదృశ్యమయ్యారని తెలిపారు. చిన్నారుల అదృశ్యం కేసులు మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, గుజరాత్‌, ఒడిశా తదితర రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నాయి.

  • ఎపిలో 16,739 ఎకరాల రక్షణ శాఖ భూమి

ఆంధ్రప్రదేశ్‌లో 16,739 ఎకరాల కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ భూమి ఉందని ఆ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్‌ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 18,11,113 ఎకరాల భూమి రక్షణశాఖ పరిధిలో ఉందని, తెలంగాణలో 28,480 ఎకరాల భూమి ఉందని తెలిపారు.