ప్రజాశక్తి-బాపట్ల : ఛందోలు గ్రామంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు ఛందోలు గ్రామ టీడీపీ నాయకులు నిజాo సోదరుల ఆధ్వర్యంలో తోఫా అందజేశారు. ఈ సందర్భంగా నిజాం మాట్లాడుతూ వ్యాపారాలలో క్షణం తీరిక లేకుండా ఉన్న తాను ప్రజా సేవ చేయాలి అని దృఢ సంకల్పంతో గ్రామంలో ఉంటున్నాను అన్నారు. రంజాన్ లాంటి పవిత్రమైన పండుగను పురస్కరించుకుని సేవ కార్యక్రమాలు ప్రారంభించటం జరిగింది అన్నారు. గతంలో ఎందరికి ఉచిత విద్యను అందించిన తన తండ్రి ఆశయాలను తాను పుణికి పుచుకున్నట్లు తెలిపారు.గన్ పంతులు గా పిలవబడే తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పేదలకు సాయం చేయాలి అని ఒక ప్రణాళిక రూపొందించుకున్నానని అన్నారు. దీనిలో భాగంగానే ఇఫ్తార్ విందు రోజు రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు ని ఛందోలు గ్రామానికి తీసుకురావటం జరిగింది అన్నారు. వారు ఇచ్చిన అమూల్య సలహాల సహాయంతో తన సోదరుల సహకారంతో సుమారు400 మందికి తోఫా అందిస్తున్నానని అన్నారు. తన అభిమాన నాయకుడు చంద్రబాబు జన్మదిన సందర్భంగా ఈ మంచి కార్యక్రమంకు శ్రీకారం చుట్టటం జరిగింది అన్నారు.గ్రామంలోని నాయకులను కలుపుకుంటు గ్రామ సమస్యలు పై దృష్టి సారించి తన పరిధిలో సమస్యలు పరిష్కారం చేస్తానన్నారు.పారదర్శక రాజకీయాలు చేసి పేదవాని అబివృద్ధికి సాయం చేయటమే తన లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ పార్లమెంటరీ అధ్యక్షుడు ఖాసీం, మీరా, తదితరులు పాల్గొన్నారు.










