
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కృత్రిమ అడ్డుగోడగా నిలిచినందునే ఆర్టికల్ 370ని రద్దు చేశామని ఆయన చెప్పారు. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె), గిల్జిత్ బల్టిస్తాన్‌లను పాకిస్థాన్‌ను చట్ట విరుద్ధంగా ఆక్రమించిందని ఆరోపించారు. జమ్ములో ఆదివారం జరిగిన 'కార్గిల్ విజరు దివస్' సభలో ఆయన ప్రసంగించారు. జమ్ముకాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని భారత్‌లో మిగిలిన ప్రాంతాల మాదిరే అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. అయితే జమ్ముకాశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవాదుల దాడులు, సైనిక ఆపరేషన్లలో చనిపోతున్న పౌరులు, పదేపదే విధిస్తున్న ఇంటర్నెట్ ఆంక్షలు గురించి ఆయన ప్రస్తావించకపోవడం పట్ల స్థానిక ప్రజానీకం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.