Nov 01,2023 11:49

న్యూఢిల్లీ :   మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) తీవ్ర దుర్వినియోగంపై కోర్టులు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్‌ ఎంపి కపిల్‌ సిబల్‌ బుధవారం పేర్కొన్నారు. నవంబర్‌ 2న విచారణకు హాజరుకావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమన్లపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇడి కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది.. ఈడి దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకుంటోందని ధ్వజమెత్తారు. ఈడి, నేతలకు బెయిల్‌ నిరాకరించడం కేంద్ర ప్రభుత్వం చేతిలో రాజకీయ ఆయుధంగా మారిందని అన్నారు. పిఎంఎల్‌ఎ దుర్వినియోగంపై కోర్టులు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్‌ నిరాకరించడంపై స్పందించారు. ఈడి ప్రతిపక్ష నేతలను లక్ష్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ 'ఇండియా' కూటమి తమ గొంతుకను వినిపించాలని అన్నారు.