May 16,2023 12:53

న్యూఢిల్లీ : రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ను విచారిస్తున్న తీరుపై ప్రముఖ రాజకీయనాయకుడు, న్యాయవాది కపిల్‌ సిబాల్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. 'రెజ్లర్ల లైంగిక వేదింపుల కేసులో విచారిస్తున్న తీరు మాకు తెలుసు. కొన్ని విచారణలు నిందితుడిని శిక్షించడానికి, మరికొన్ని రక్షించడానికి దర్యాప్తు జరుగుతుంది' అని కపిల్‌ సబాల్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సిబాల్‌ సుప్రీంకోర్టులో రెజ్లర్ల తరపున వాదించారు.
కాగా, ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌ భూషణ్‌ని విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌)ని ఏర్పాటు చేసినట్లు ప్రత్యేక కోర్టుకు శుక్రవారం తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే బ్రిజ్‌ భూషన్‌ విచారిస్తున్న తీరుపై సిబాల్‌ వ్యాఖ్యానించారు.