న్యూఢిల్లీ : బిజెపి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. తాజాగా మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయాలు 'తమాషా'గా ఉన్నాయని రాజ్యసభ ఎంపి కపిల్ సిబాల్ అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ట్వీట్ చేశారు. 'మహారాష్ట్రలో తాజా రాజకీయాలు చూస్తే ప్రజాస్వామ్యంలా లేవు. తమాషాగా అనిపిస్తోంది. వీటికి చట్టం కూడా అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ జరుగుతున్నదంతా అధికార రొట్టెల గురించే కానీ.. ప్రజల గురించి కాదు' అని సిబాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా, ఎన్‌సిపి పార్టీలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ ఎన్‌సిపి ఎమ్మెల్యేలను బిజెపి గూటికి చేర్చారు. ఈ పరిణామంతో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో.. తాను డిప్యూటీ సిఎం అయ్యారు. రాబోయే ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రి అవుతానని బుధవారం ప్రకటించారు.