న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో ఇప్పటి వరకు అతిపెద్ద ఇన్వెస్టర్‌గా ఉన్న ఉబర్ అనుహ్యాంగా వైదొలిగిన రెండు రోజులకే మరో ఇన్వెస్టర్ టైగర్ గ్లోబల్ ఆ సంస్థకు షాక్ ఇచ్చింది. జొమాటోలో తన 2.77 శాతం వాటాకు సమానమాయ్యే 18.45 కోట్ల షేర్లను ఓపెన్ మార్కెట్‌లో టైగర్ గ్లోబల్ ఇన్వెస్టర్ విక్రయించింది. ఈ విక్రయానికి ముందు జొమాటోలో ఈ సంస్థకు 5.11 శాతం వాటా ఉంది. జులై 25 నుంచి ఆగస్టు 2 మధ్య 18.45 కోట్ల షేర్లను టైగర్ గ్లోబల్ విక్రయించిందని జొమాటో రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. ఇటీవలే ఈ ఫుడ్ డెలివరీ సంస్థలోని 7.8 శాతం వాటాను ఉబెర్ దాదాపు రూ.3 వేల కోట్లకు విక్రయించింది.










