Nov 20,2023 20:52

న్యూఢిల్లీ : ఎసిడిటి నుంచి ఉపశమనం కల్పించడానికి ఉపయోగించే ఈనోలో కొత్తగా చప్పరించే బిల్లలు (ఈనో చూవి బైట్స్‌)ను విడుదల చేసినట్లు హేలియన్‌ సంస్థ వెల్లడించింది. ఇప్పుడు చప్పరించేందుకు అనువైన యాంటాసిడ్‌ ఈనో చూవబుల్‌ బైట్స్‌ను టాంగీ లెమన్‌, జెస్టీ ఆరెంజ్‌ రెండు రుచులలో ఆవిష్కరించినట్లు పేర్కొంది. ఇవి ఎసిడిటీ నుంచి తక్షణం ఉపశమనం కల్పిస్తాయని పేర్కొంది.