May 04,2023 22:12
  • నివారణకు దేశాలు చర్యలు తీసుకోవాలి

న్యూఢిల్లీ : కోవిడ్-19కు కారణమయ్యే సార్స్‌ కోవిా2 వైరస్‌ ఇంకా ఉనికిలోనే ఉందని, ఇతర అంటువ్యాధుల మాదిరిగానే దీని నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విజ్ఞప్తి చేసింది. ఈ ప్రారంభంలో జారీ చేసిన 'కోవిడ్‌ 19 గ్లోబల్‌ స్ట్రాటజిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌, రెడీనెస్‌ అండ్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌ (ఎస్‌పిఆర్‌పి) 2023' ఈ విషయాన్ని తెలిపింది.
ఇప్పటికీ అంతర్జాతీయంగా ఆందోళన కలిస్తున్న కోవిడ్‌ మహమ్మారిపై ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని అంచనా వేయడానికి డబ్ల్యూహెచ్‌ఓ ఈ నివేదికను విడుదల చేస్తోంది. వచ్చే రెండేళ్లలో కోవిడ్‌ను ఎలా ఎదుర్కొవాలో ఇందులో మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. కోవిడ్‌ా19 పుట్టిన నాలుగో సంవత్సరం వేళ కోవిడ్‌పై నిఘా క్షీణించిందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం కేసులు, మరణాలు అత్యల్ప స్థాయిలో ఉన్నప్పటికీ ఇంకా అనేక మిలియన్ల మంది సార్స్‌ాకోవిా2 భారీన పడతున్నారని లేదా మరోసారి దీని బారీనపడుతున్నారని తెలిపింది. వ్యాప్తిని తగ్గించడంపై ప్రత్యేక దృష్టిని సారించాలని, దీని కోసం కోవిడ్‌ను నిర్థారణ చేయడం, చికిత్స చేయడం వేగంగా చేయాలని ప్రభుత్వాలకు డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది.