- సమావేశంలో మాట్లాడుతున్న శాసన సభ్యులు అనగాని సత్య ప్రసాద్
ప్రజాశక్తి-రేపల్లె : టీడీపీ నాయకులు సైనికుల్లా పని చేస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు, చంద్ర బాబు సీఎం అయ్యేందుకు కృషి చేయాలని శాసన సభ్యులు అనగాని సత్య ప్రసాద్ పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలపై బూత్ కమిటీ సభ్యులు అవగాహన కలిగి ఉండాలని శాసన సభ్యులు అనగాని సత్య ప్రసాద్ సూచించారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత విషయంలో భాగంగా గురువారం పట్టణంలోని వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో అసత్య ప్రచారాలు, అబద్ధపు మాటలు పదే పదే చెప్పి అధికారం చేపట్టారని ఆరోపించారు. ప్రస్తుతం రానున్న ఎన్నికల కోసం కొత్త అబద్దాలు ప్రచారం చేసి, తెలుగుదేశం పార్టీకి చెందిన ఓటర్లను జాబితా నుండి తొలగించే యత్నాలు జరుగుచున్నాయని హెచ్చరించారు. దీనిని తిప్పి కొట్టేందుకు బూత్ కమిటీ సభ్యులు, క్లస్టర్ యూనిట్ సభ్యులు, పట్టణ, రూరల్, గ్రామస్థాయి, వార్డు ఇంఛార్జీలు ఓటరు జాబితాలపైన పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలనే సంకల్పంతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాలకు, సాయంత్ర రేపల్లె పట్టణం, రూరల్ గ్రామాలకు చెందిన క్లస్టర్ సభ్యులకు అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలో పేర్లు లేక పోయినా, చనిపోయిన వారి పేర్లు ఉన్న కమిటీ దృష్టికి తీసుకు వచ్చి సరి చేయంచాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పంతాని మురళీధరరావు, రాష్ట్ర మహిళ కార్యదర్శి దున్న జయప్రద, జీ వి నాగేశ్వరరావు, సూరగాని శాంతికుమార్, రాజశేఖర్, చైతన్య కుమార్, మానం శ్రీనివాస్ నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్,యూనిట్ ఇంచార్జ్ , గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ ఇంఛార్జీలు పాల్గొన్నారు.










