
ప్రజాశక్తి-పాలకొల్లు : చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద 12 వ రోజు ఆదివారం గీత కార్మికులు దీక్షల్లో కూర్చున్నారు. అంతకు ముందు గీత కార్మికులు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద చంద్రబాబును భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ చంద్రబాబు పై జగన్ కక్ష కట్టి జైల్లో ఉంచారని ప్రజలు రానున్న ఎన్నికల్లో జగన్ కు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.గీత కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వమే చీప్ లిక్కర్ ను మధ్యంగా అమ్మి పేదల ఆర్థిక, ఆరోగ్యం పాడు చేస్తోందని చెప్పారు. టిడిపి నేతలు పెచ్చెట్టి బాబు, జివి, పెన్మెత్స రామభద్రరాజు, దుగ్గిన రాము తదితరులు పాల్గొన్నారు