Oct 18,2023 14:46

ప్రజాశక్తి - ఆలమూరు : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైకాపా ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరుతూ టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపు మేరకు మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆలమూరు బస్టాండ్ సెంటర్లో బుధవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కళ్ళకు గంతలు కట్టుకొని వినూత్నమైన నిరసన తెలిపారు. సైకో పోవాలి... సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. అక్రమ కేసులు బనాయించి ఆధారాలు చూపకుండా వాయిదాలతో ప్రభుత్వం కాలం గడుపుతుందని వెంటనే న్యాయవ్యవస్థ చంద్రబాబుకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.