Oct 07,2023 10:42

ప్రజాశక్తి-విజయనగరం కోట : ప్రజాస్వామ్యంలో కొత్త పద్ధతికి తెరలేపారని కొండకరకాం మాజీ ఎంపీటీసీ కిలారి సూర్యనారాయణ, సుంకర పేట మాజీ సర్పంచ్ సుంకరి రామనాయుడు, మలిచర్ల నాయకులు టి రామారావు అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టులకు నిరసనగా 25వ రోజైన శనివారం నాడు బాబుతో మేము బాబుతో నేను అనే కార్యక్రమంలో భాగంగా స్థానిక అశోక్ బంగ్లా టిడిపి కార్యాలయం వద్ద చేపడుతున్న నిరసన దీక్షలో పాల్గొన్న వీరు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలోనే ఎటువంటి ఆధారాలు లేకుండా సాక్షాలు లేకుండా అరెస్ట్ చేయడం ఇదే మొదటి సారి అని తెలిపారు రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులే కొనసాగితే ప్రజాస్వామ్యం లో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినట్లేని మండిపడ్డారు అరెస్ట్ చేసి నెల రోజులు దగ్గరవుతున్న ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని సిఐడి కస్టడీ లో ఉంచి జైల్లో పెట్టడం ఎంతవరకు రాజ్యాంగబద్ధంగా ఉందని ప్రశ్నించారు అదేవిధంగా దేశంలో ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె ఇలా జరిగితే సామాన్య ప్రజలకు ఎంతవరకు రక్షణ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు విడుదలైన వరకు ఈ నిరసన దీక్షలు కొనసాగుతాయని తెలిపారు అదే విధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధమైన పాలన సాగడం లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో పైడిరాజు శ్రీను సుంకర పేట మనిచర్ల కొండకారకం టిడిపి నాయకులు పాల్గొన్నారు.