ప్రజాశక్తి-వేపాడ : వేపాడ మండల కేంద్రానికి సోంపురం జంక్షన్ నుండి వేపాడు మీదుగా ఆనందపురం జంక్షన్ వరకు 19 కిలోమీటర్ల పొడవు గల రోడ్డు నిర్మాణం పనులకు ప్రభుత్వం 39 కోట్లు మంజూరు చేయడం జరిగింది. నిధులతో రోడ్డుపనులు చేపడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన మట్టితో నిర్మించిన బెరమలు ఈ మధ్య పడిన చిన్నపాటి వరసాలకే జగ్గయ్యపేట అరిగిపాలెం రోడ్డుకు ఇరువైపులా బెరమలు భారీగా జారిపోవడంతో పలువురు ప్రయాణికులు రోడ్డు నిర్మాణం పనులు ఎంత నాశరకంగా జరుగుతున్నాయో, ఏ విధంగా ప్రజాధనం వృధా అవుతుందో అంటూ పలువురు విమర్శిస్తున్నారు. దీనంతటికీ కారణం సంబంధిత అధికారులు పర్యవేసము లేకుండా పనులు చేపట్టడమేనంటున్నారు. ఇప్పటికైనా నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మాణం పనులు చేపడితే కొంతకాలమైనా ఈ రోడ్డుపై ప్రయాణం సాగించుకోవచ్చు లేదంటే అంతే సంగతి అంటున్నారు.










