- రౌండ్ టేబుల్ సమావేశం తీర్మాణంలో వక్తలు డిమాండ్
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే ఉప సంహరించుకోవాలని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం తీర్మాణం చేసింది. విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం నగర అద్యక్షుడు కంది త్రినాథ్ అద్యక్షతన జరిగిన సమావేశంలో కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుమ్మక్కై విద్యుత్ చార్జీలను అమాంతంగా పెంచి 1400 కోట్ల రూపాయలు ప్రజలపై భారాల మోపుతున్నాయని ఆరోపించారు. గతంలో సంవత్సరానికో రెండు సంవత్సరాలకు విద్యుత్ చార్జీలు పెంచేవారు అని ఇప్పుడు మరి దారుణంగా ప్రతి నెల విద్యుత్ చార్జీలు పెంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఇప్పటివరకు కరెంట్ బిల్లు చెల్లించిన సర్దుబాటు చార్జీలు పేరుతో 6000 కోట్ల రూపాయలు భారాన్ని ప్రజలపై మోపారని అన్నారు. నాలుగేళ్లలో 26 వేల కోట్ల రూపాయలు కరెంటు చార్జీల బారాలు ప్రజల నెత్తిన మోపాలని అన్నారు. ఏప్రిల్ నెలలో యూనిట్ కి 80 పైసలు చొప్పున పెంచారని అన్నారు. ఈ విధంగా కరెంటు చార్జీలను ప్రజలు మోయలేని విధంగా పెంచుతూ కార్పొరేట్ శక్తులకు వేల కోట్లల్లో ప్రజాధనం సమకూర్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో ఈ విధంగా కరెంటు చార్జీలను అమాంతంగా పెంచి ప్రజలపై భారాలు వేస్తే పేద ప్రజలకు గుడ్డి దీపమే దిక్కు అయ్యేలా పాలకులు చేస్తున్నారని ఈ విధానాలను ప్రజలందరూ తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలి అని అన్నారు. సాయి అమృతా రెసిడెన్సీ కార్యదర్శి యు ఎస్ . రవికుమార్ మాట్లాడుతూ 1999లోనే విద్యుత్ సంస్కరణలు నాటి వాజ్పాయ్ ప్రభుత్వం ప్రారంభించింది. నేటి మోడీ మరింత వేగంగా అమలు చేస్తున్నారని. విటి పలితంగా కరెంట్ బిల్లు భారీగా పెరుగుతాయన్నారు.ఛాంబర్ అఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ వి.సతీష్ మాట్లాడుతూ రాబోయే కాలంలో స్మార్ట్ మీటర్లు తెస్తారు.వాటిని ఇప్పటినుండే త్రిప్పీ కొట్టాలని అన్నారు. య్యప్పా నగర్ కాలనీ కార్యదర్శి సుదీర్ మాట్లాడుతూ సర్ చార్జీలు,సర్థు బాటు చార్జీల పేరుతో పెంపు జరుగుతున్నదని అన్నారు, కె వి పి ఎస్ జిల్లా కార్యదర్శి రాకొటి ఆనంద్ మాట్లాడుతూ దళితులు కు ఇచ్చే సబ్సిడి ఎత్తేస్తారని అన్నారు. రజక సంఘం జిల్లా నాయకులు భాస్కరరావు.చిన్నా, నాలుగువతరగతి ఉద్యోగుల సంఘం నాయకులు ప్రసాద్ ఐద్వా జిల్లాకార్య దర్శి పి. రమణమ్మ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురే ష్ ,ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు, వెంకటేశ్. ఎల్ బి జి నగర్ కార్యదర్శి బి. రమణ, సీఐటీయూ నాయకులు జగన్, గురజాడ నగర్ నాయకులు, వెంకటరావు, ఐద్వా జిల్లా నాయకులు, వి. లక్ష్మీ, తది తరులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.










