Sep 22,2023 16:57

ప్రజాశక్తి-కారంచేడు : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు  అక్రమ అరెస్టును నిరసిస్తూ రిమాండ్ ని ఎత్తివేయాలి అని కోరుతూ టిడిపి సీనియర్ నాయకులు పర్చూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య చౌదరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన 14వ రోజు కు చేరింది. కారంచేడు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆందోళన కార్యక్రమం శుక్రవారం నాడు జరిగింది. రాష్ట్రంలో అంబే డ్కర్ రాజ్యాంగం అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలపరుస్తున్న రాజారెడ్డి రాజ్యాంగం పోవాలి అంటూ బిఆర్ అంబేడ్కర్  చిత్రపటం ఉన్న ప్లకార్డ్ లతో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేము సైతం బాబు కోసం అంటూ, చంద్రబాబు నాయుడు విడుదల అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కంభంపాటి నరేంద్ర ,పాతూరి ఆదిలక్ష్మి, పోతిన వెంకటేశ్వర్లు, తాళ్లూరి అనిల్ కుమార్ , షేక్ కాలిషా వలి, కొల్లా భాస్కరరావు, గద్దె సబ్బయ్య   పెద్ద ఎత్తున్న మహిళాలు కార్యకర్త లు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.