- 27వ రోజుకు చేరిన రిలే నిరాహారదీక్షలు
ప్రజాశక్తి-రామచంద్రపురం : జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కి నిరసనగా కొనసాగుతున్న రిలే దీక్షలు సోమవారం 27వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం దీక్షలో తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. "మేము సైతం" అంటూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు "బాబు కి తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్షలు" కార్యక్రమంలో భాగంగా గత 27 రోజులుగా రామచంద్రపురం పట్టణంలో జరుగుతున్న నిరాహార దీక్ష శిబిరంలో రామచంద్రపురం పట్టణంలోని మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.










