Oct 20,2023 11:00
  • ప్రజలంతా సైకిల్ ఎక్కి సైకోను తొక్కాలి. 

ప్రజాశక్తి - ఆలమూరు : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులకు నిరసనగా మండలంలోని తెలుగుదేశం నాయకులు శుక్రవారం గుమ్మిలేరులో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. నాయకులంతా బస్టాండ్ సెంటర్లో ఒంటి కాలిపై నిల్చుని వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సైకో పోవాలి సైకిల్ రావాలి, అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావాలి అని నినాదాలు చేశారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన ప్రత్యేక హోదా సాధన, పోలవరం పూర్తి, సిపిఎస్ రద్దు, అమరావతి నిర్మాణం, జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల వంటి ముఖ్యమైన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని, రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా పక్కన పెట్టి అరాచకాలు, అక్రమ కేసులతో ప్రతిపక్ష నాయకులను హింసిస్తూ పాలన సాగిస్తున్న వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా సైకిల్ ఎక్కి సైకోను తొక్కకపోతే మనుగడ కష్టమని తెలుగుదేశం నాయకులు నినాదాలు చేశారు. అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.