Jan 14,2023 16:08

ప్రజాశక్తి-రాంబిల్లి :  శనివారం ఎలమంచిలి నియోజకవర్గం, రాంబిల్లి మండలం, పంచదార్ల  గ్రామంలో మాజీ ఎంపీపీ లక్ష్మీ, మరియు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వసంతవాడ వెంకటేశ్వరరావు (దినుబాబు) ఆధ్వర్యంలో వైయస్సార్సీపి ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు సభలూ, సమావేశాలు, నిర్వహణను అడ్డుకునేందుకు వీలుగా, ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి జీవో నెంబర్ ఒకటిని విడుదల చేయడం జరిగింది. దానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు ఈరోజు జీవో నెంబర్ ఒకటి కాపీని భోగిమంటల్లో కాల్చి దగ్ధం చేయడం జరిగినది. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దినుబాబు మాట్లాడుతూ, చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని చూసి తట్టుకోలేక వైఎస్సార్సీపి ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ ఒకటిని భోగమంటల్లో కాల్చి దగ్ధం చేయడం జరిగిందని, ఈ విధంగానే అతని ప్రభుత్వాన్ని కూడా తొందరలోనే భోగిమంటల్లో వేసే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. సైకో పోవాలి- సైకిల్ రావాలి, అని ప్రజలంతా కోరుకుంటున్నారని, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయం తద్యం అని అన్నారు. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు