Nov 25,2022 15:17

ప్రజాశక్తి -నందిగామ : ఇటీవల ఉరి పోసుకుని ఆత్మ హత్య చేసుకున్న అమ్మినేని రవికుమార్  కుటుంబ సభ్యులను శుక్రవారం మాజీ మంత్రి,టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  దేవినేని ఉమామహేశ్వరావు పరామర్శించారు.  నందిగామ నియోజకవర్గం టిడిపి రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి అమ్మినేని జ్వాల ప్రసాద్   సోదరుడు రవికుమార్  ఇటీవల మరణించటం బాధకరమన్నారు. రవి కుమార్ కుటుంబ సభ్యులకు  టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు  సానుభూతి,సంతాపం తెలిపారు. శుక్రవారం నాడు నందిగామ పట్టణంలో పర్యటించిన ఉమా రవికుమార్ స్వగృహమునందు   చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ మాజీ ఎంఎల్ఎ తంగిరాల సౌమ్య, నందిగామ పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు.