ప్రజాశక్తి-రేపల్లె : పురపాలకసంఘం, 14వ వార్డు కౌన్సిలర్ అన్నే రామకృష్ణ దుండగుల దాడిలో మృతి చెందడం విచారకరమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు అన్నారు. బుధవారం రామకృష్ణ పార్దీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ మేరకు రామకృష్ణ కుటుంభ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేసారు. ఆయనతో పాటు బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ ఛైర్మన్ దేవినేని మల్లికార్జునరావు పురపాక సంఘ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ కుమార్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.










