
దేవరపల్లి (పశ్చిమగోదావరి): ట్రిపుల్‌ఐటిలో సీటు సాధించిన విద్యార్థులను గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శనివారం అభినందించారు. ట్రిపుల్‌ఐటిలో ఎంట్రన్స్ టెస్ట్ రాష్ట్రస్థాయిలో ఓపెన్ కేటగిరిలో ర్యాంకులు సాధించిన బలం జాన్‌దేవదాస్, ఎ.రిషిత, శ్రీపావని, ఉదయశివ కిరణ్, ముళ్ళపూడి చందన, శ్రీలు ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో శనివారం కలిశారు. వీరిని ఎమ్మెల్యే అభినందించారు. ఇంకా కష్టపడి చదివి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో భాష్యం స్కూల్ జోనల్ ఇన్‌ఛార్జి జి.నాగసత్యనారాయణ. అసిన్ స్కూల్ ప్రిన్సిపాల్ జిఎస్.రాజు, పేరయ్య నాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు.