Feb 11,2021 18:44

మాట్లాడుతున్న షేక్‌ జానిభాషా, సింగారావు తదితరులు

జాతీయ రంగస్థల పురస్కార ప్రదానోత్సవం
భారీ మొత్తంలో ప్రదర్శనా పారితోషకం, బహుమతులు
ప్రజాశక్తి-తెనాలి : 
జాతీయ స్థాయి పద్య నాటిక పోటీలను ఏప్రిల్‌ 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కళల కాణాచి సంస్థ ప్రధాన కార్యదర్శి షేక్‌ జానిభాషా చెప్పారు. పట్టణానికి చెందిన కళలకాణాచి సంస్థ, విజయవాడ వేదగంగోత్రి ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన పోటీల వివరాలను స్థానిక సీపీఐ కార్యాలయంలో గురువారం జానిభాషా వివరించారు. పోటీలను స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తామని, ప్రదర్శనా పారితోషకాన్ని కూడా రూ.50వేలుగా నిర్ణయించామన్నారు. మొటిటి బహుమతి రూ.లక్ష, బంగారు వీణ, రెండో బహుమతిగా రూ.75వేలు, వెండి వీణ, మూడవ వహుమతి రూ.50వేలు కాంస్యవీణ బహూకరిస్తామన్నారు. ఎంట్రీలను ఈనెల 25లోగా పంపాలని, ఎంట్రీ రుసుము రూ.2వేలు ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. ఎంట్రీలను చెరుకుమల్లి సింగారావు, డోర్‌ నెం.2-29-83ఎ-1, కవిరాజా పార్కురోడ్డు, గాంధీనగర్‌ తెనాలి చిరునామాకు పంపాలన్నారు. వివరాలకు 9296906121 నెంబరులో సంప్రదించాలన్నారు. అలాగే నాటకోత్సవాల ముగింపు రోజున బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి జాతీయ రంగస్థల పురస్కార ప్రదానోత్సవం ఉంటుందన్నారు. సమావేశంలో కళలకాణాచి సంస్థ ఉపాధ్యక్షులు చెరుకుమల్లి సింగారావు, ఎంపీ కన్నేశ్వరరారావు, గోగినేని కేశవరావు, బడుగు మోహనరావు, డి.భవాని, చిన్నా పాల్గొన్నారు.