Jan 23,2021 23:48

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శివకుమార్‌

ప్రజాశక్తి-తెనాలి : పేదలకు పెద్దదిక్కుగా ఉన్న వైద్యశాల్లో సిబ్బంది అసత్వం వీడి సమిష్టిగా పని చేయాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ అన్నారు. వైద్యశాల అభివృద్ది కమిటీ సమావేశం వైద్యశాల అభివృద్ది కమిటీచైర్మన్‌ డాక్టర్‌ నన్నపనేని ప్రతాప్‌ అధ్యక్షతన జరిగింది. తల్లీపిల్లల వైద్యశాల భవనం మెడికల్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. వైద్యశాల్లో చిన్ని చిన్న సమస్యలున్నాయన్నారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే, దాని ప్రభావం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంపై పడుతుందన్నారు. వైద్యశాల్లో రోగుల సహాయకులకోసం షెడ్డును, ఆవరణలో క్యాంటిన్‌ను ఏర్పాటు చేసి, వైఫై సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. సబ్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. సమావేశంలో ఏపీవైద్యవిధాన పరిషత్‌ జిల్లా కోఆర్డినేరట్‌ డాక్టర్‌ కె.ఈశ్వరప్రసాద్‌, వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.సనత్‌కుమారి, కమిటీ సభ్యులు డాక్టర్‌ భీమవరపు సాంబిరెడ్డి, ఏఈ విశ్వనాద్‌, ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ జయకరుణ పాల్గొన్నారు.