ప్రజాశక్తి - మాచర్ల్ల : మాచర్ల మున్సిపల్ చైర్మన్‌గా తురకా కిషోర్ బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఛాంబర్‌లో పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి, వైసిపి రాష్ట్ర యువజన సంఘ కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పాల్గొని మాట్లాడారు. పట్టణ అభివృద్ధిలో కిషోర్‌కు వెన్నంటి ఉండి తమ సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బోయ రఘురామిరెడ్డి, పోలూరి నరసింహరావు, కమీషనర్ గిరికుమార్, ఆర్‌ఒ రమణబాబు, కౌన్సిలర్స్ పోలా శ్రీనివాసరావు, రామిశెట్టి వెంకటేశ్వర్లు, కరిమూల్లా, షేక్ సుభాని, మదార్‌సాహెబ్, కజ్జం సైదయ్య, కుర్రి సాయిమార్కోండారెడ్డి,పిన్నెల్లి తేజారెడ్డి పాల్గొన్నారు.