Mar 22,2021 17:47

ముప్పాళ్లలో ర్యాలీలో పాల్గొన్న అధికారులు, నాయకులు

ప్రజాశక్తి - ముప్పాళ్ల : ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రమైన ముప్పాళ్లలో అడ్మిన్‌స్ట్రేటివ్‌ ఆఫీసర్‌ దుర్గయ్య ఆధ్వర్యంలో జలశక్తి అభియాన్‌ ర్యాలీ నిర్వహించారు. దుర్గయ్య మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలన్నారు. ఇంటి పర్యావరణంలో నీరు ఇంకే విధంగా ఇంకుడు గుంతలు ఏర్పరచుకోవాలని, తద్వారా వేసవిలో కూడా నీటి కొరత ఏర్పడదని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆర్‌.నాగేశ్వరరావు, సర్పంచ్‌ ఎం.సతీష్‌, వైసిపి నాయకులు వుట శ్రీనివాసరెడ్డి, వార్డు నెంబర్లు సీతారామయ్య, చెన్నయ్య, సిలార్‌ తదితరులు పాల్గొన్నారు.