Feb 05,2021 23:40

వినతిపత్రం అందజేస్తున్న స్థానికులు, నాయకులు,

ప్రజాశక్తి - ముప్పాళ్ల : మండలంలోని చాగంటివారిపాలెం అడ్డరోడ్డు వద్ద నుంచి ముప్పాళ్ల గ్రామం ఊరి చివర వరకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని చాగంటివారిపాలెం గ్రామ ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం తహశీల్దార్‌ ఆర్‌.యశోదకు, మండల పరిషత్‌ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, పంచాయతీ కార్య దర్శికి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోనే జడ్‌పి ఉన్నత పాఠశాల ఉందని, విద్యార్థులకు ఏ ప్రమాదం ముంచుకొస్తుందేమోనని ఆందోళనగా ఉంద న్నారు. పాఠశాల వద్ద, ముప్పాళ్ల సెంటర్లో స్పీడ్‌ బేకర్లు ఏర్పా టు చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో ప్రజా సంఘాల నాయకులు గుంటుపల్లి బాలకృష్ణ, తోరటి అమరలింగేశ్వరరావు, నూకారపు సాంబశివరావు ఉన్నారు.