ప్రజాశక్తి-తెనాలిరూరల్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. రూరల్ గ్రామం పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో మంగళవారం అమ్మఒడి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీలో ఆయన ముఖ్యతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయని సంక్షేమ పథకాలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నాడు-నేడు కార్యక్రమం ద్వారా పూర్తిస్థాయి వసతులు కల్పించారన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ కె.రవిబాబు, ఎంపీడీవో ఎల్.విజయాలక్ష్మణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










