Jan 04,2023 16:04

ప్రజాశక్తి - రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరు గ్రామం లో జిల్లా పరిషత్ హై స్కూల్  నందు 8వ తరగతి విద్యార్థులకు జెడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి ట్యాబ్స్ పంపిణీ చేశారు .ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన విద్యను ప్రైవేటు పాఠశాలల దీటుగా అందిస్తూ, ఇంగ్లీష్ మీడియంతో పాటు, నాడు, నేడు అనే గొప్ప కార్యక్రమనికి శ్రీకారం చుట్టి పాఠశాలల రూపురేకలు మార్చిన గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ప్రతి ఒక్కరి అవకాశాలు అంది పుచ్చుకొని ఉన్న స్థాయిలో ఎదగాలని కోరారు. నాడు,నేడు కింద స్కూల్ అభివృద్ధి కొరకు కోటి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసిన శాసన సభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ముదగాన నాగబాబు వైస్సార్సీపీ సీనియర్ నాయకులు రామినేని వీరాస్వామి నాయుడు, కలకొండ రామారావు,కె ప్రసాద్,వైస్ సర్పంచ్ తాముండ్రా వీరయ్య,సచివాలయ కన్వీనర్ బజారు కొండల్ రావు (బుజ్జి ),స్కూల్ కమిటీ చైర్మన్ కారంగుల జమలయ్య, పాఠశాల హెడ్ మాస్టర్ వరద శ్రీనివాస్ రావు మరియు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.