Oct 01,2023 11:15

ప్రజాశక్తి-రామచంద్రపురం : గ్రామాల్లో స్వచ్ఛత సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కే గంగవరం మండలం శివల గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ అనసూరి సాయిబాబు ఆధ్వర్యంలో స్వచ్ఛత సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెదరామాలయం వీధి చిన్న రామాలయం విధి వాటర్ ట్యాంక్ డ్రైనేజీలను శుభ్రపరిచి బ్లీచింగ్ చెల్లించారుట్రాక్టర్ పై వేరేచోటకు తరలించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సుబ్బారావు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా దంగేరు లో జరిగిన స్వచ్ఛత సేవా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొప్పిశెట్టి వెంకటరమణ, ఎంపీటీసీ లక్ష్మణ్ కార్యదర్శి పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.