Sep 16,2023 14:13
  • స్వచ్ఛభారత్ ను పాటిద్దాం

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్  : ప్రపంచ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా మత్స్యకార సంక్షేమ సమితి శనివారం మంగినపూడి బీచ్ లో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో జనసేన పార్టీ మచిలీపట్నం ఇంచార్జ్ బండి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని భూమండలం చుట్టూ మన కోసం కలిగి ఉన్న ముఖ్యమైన జలవనరుల్లో సముద్రం ఒకటని కోట్లాది జలజీవరాసులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని తెలిపారు. మంగినపూడి బీచ్ వద్ద చెత్త వేయుటకు డస్ట్ బిన్లను జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని ప్రకృతి ప్రేమికులు పర్యాటకులు వాటిని వినియోగించుకోవాలని సూచించారు. జలవనరులు కాలుష్యం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిదని రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంక్షేమ సమితి ప్రతినిధులు పోలయ్య, పరిమెల్లవాసు, తాతయ్య మరియు ఆర్కే కాలేజ్ విద్యార్థులు జనసేన పార్టీ నాయకులు శ్రీపతి వాకలరావు గడ్డంరాజు, వంపుగడవల చౌదరి, కర్రీ మహేష్, కొట్టే వెంకట్రావు,బీరం సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.