Oct 02,2023 11:07

న్యూఢిల్లీ :   నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ (ఎన్‌ఐఎ) జాబితాలో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల్లో ఒకరైన షానవాజ్‌ను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. వృత్తి రిత్యా ఇంజనీర్‌ అయిన షానవాజ్‌కి ఐసిస్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం అతనిని విచారిస్తున్నట్లు వెల్లడించారు.
పూణె పోలీసుల కస్టడీ నుండి తప్పించుకుని తిరుగుతున్న అతనిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతనిపై రూ. 3 లక్షల రివార్డ్‌ ఉన్నట్లు చెప్పారు.
షానవాజ్‌ అలియాస్‌ షఫీ ఉజ్జామాను ఢిల్లీలోని రహస్య స్థావరం నుండి ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం అరెస్ట్‌ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నిరోధించేందుకు ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ పలు రాష్ట్రాలలో ఎన్‌ఐఎతో కలిసి పనిచేస్తోంది.