Jul 07,2023 14:18
  • కమాండర్ కల్నాల్ సునీల్ గౌతమ్ 
  • ఎన్ సి సి క్యాడేట్స్ ధృవీకరణ పత్రాలు అందజేత 

ప్రజాశక్తి-చీరాల : క్రమశిక్షణ మరో పేరు ఎన్ సి సి విద్యార్థులు అని 23 ఆంధ్రా బెటాలియన్ ఎన్ సి సి కమాండర్ కల్నాల్ సునీల్ గౌతమ్ అన్నారు. శుక్రవారం స్థానిక సెయింటెన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎన్ సి సి విద్యార్థులకు ఏ సర్టిఫికెట్ ప్రథానోత్సవ కార్యక్రమం స్కూల్ ప్రిన్సిపల్, కరస్పాండెంట్ జీనా జోవియర్, ట్రీసా అధ్వర్యంలో ఎన్ సి సి కేర్ టేకర్ అధికారి పి గోపినాథ్ పర్యవేక్షణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి  ఎన్ సిసి కమాండర్ కల్నాల్ సునీల్ గౌతమ్, ఎస్ ఎం సుదేష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ సి సి సర్టిఫికేట్ లు విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయని భవిష్యత్తులో వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని అన్నారు. విద్యార్థులకు ఎన్ సిసి ఎంతో అవసరం ప్రభుత్వ ఉద్యోగాలకు మరియు వారిలో శరీర దృఢత్వంతో పాటు, ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది అన్నారు. ముందుగా కమాండర్ కల్నాల్ సునీల్ గౌతమ్ కు ఎన్ సిసి విద్యార్ధులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. స్కూల్లో మొత్తం 40 మంది ఎన్ సిసి విద్యార్థులు ఉండగా వారిలో 37ఎన్ సిసి క్యాడెట్స్ కు ఏ సర్టిఫికెట్, 3 గురికి బి సర్టిఫికెట్స పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎల్ స్టాఫ్ హవాల్దర్ రమేష్, వైస్ ప్రిన్సిపాల్ ఆరోగ్య మేరీ, పిఇటిలు విజయ నిర్మల, దనుంజయ, పలువురు పాల్గొన్నారు.