- వేసవిలో తరచూ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు ఇంట్లో ఉండే పదార్థాలు, కూరగాయాలతోనే రకరకాల పానీయాలు తయారుచేసుకోవచ్చు.
అవి ఎలానో చూద్దాం..
పుల్లటి వాటర్ : ఒక గ్లాస్ నీటిలో దోసకాయ ముక్క, కొన్ని పుదీనా ఆకులు, నారింజ ముక్కలను ఉంచాలి. ఈ నీటికి పుల్లటి రుచి వస్తుంది. అలాగే విటమిన్ సి కూడా సమృద్దిగా ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన పానీయంలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వలన వేడి దద్దుర్ల నుండి శరీరాన్ని రక్షించుకోవచ్చు.
నిమ్మకాయ, పుదీనా : ఒక గ్లాస్ నీటిలో కొన్ని పుదీనా ఆకులు, నిమ్మ ముక్కలు ఉంచి 15 నిమిషాలు మరిగించాలి. అది చల్లారిన తర్వాత తేనే కలుపుకుని తాగాలి. ఇది వేసవి వేడి నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
ఆరెంజ్ :ఆరెంజ్ నుంచి జ్యూస్ తీసి దానికి చిటికెడు ఉప్పు కలపాలి. ఈ పానీయంలో విటమిన్ సి, ఎలెక్ట్రోల్కెట్స్ సమృద్ధిగా ఉంటాయి.
పెరుగు : ఒక కప్పు పెరుగులో కొన్ని నీళ్ళు, జీలకర్ర, అల్లం ముక్కలు, చిటికెడు ఉప్పు వేసి పల్చని మజ్జిగ తయారుచేసుకొని తాగాలి. ఇందులో మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్) ఉంటుంది.
పుచ్చకాయ : పుచ్చకాయ జ్యూస్‌లో రెండు స్పూన్ల నిమ్మ రసం, చిటికెడు ఉప్పు కలపాలి. ఇది వేసవిలో అవసరమ్కెన అన్ని ఖనిజాలను శరీరానికి సరఫరా చేస్తుంది.
గ్రీన్ టీ : గ్రీన్ టీలో నిమ్మరసం కలిపి తాగవచ్చు. చల్లగా తాగాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు.
బటర్ మిల్క్ : కొంత పెరుగు తీసుకుని దానికి ఉప్పు, కొద్దిగా తేనె, స్ట్రాబెర్రీ గుజ్జు, కొన్ని ఎండిన పుదీనా ఆకులు కలుపుకుని పల్చగా తయారుచేసుకుని తాగాలి. చల్లగా ఉండేందుకు ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు.
దోసకాయ, పుచ్చకాయ : జ్యుసర్‌లో దోసకాయ, పుచ్చకాయ ముక్కలను వేసి జ్యూస్ తీయాలి. దీనికి అర స్పూన్ తేనే, చిటికెడు ఉప్పు కలపాలి. ఇంకా కొంచెం జీలకర్ర, తాజా పుదీనా ఆకులను కూడా కలపవచ్చు. ఈ పానీయం తాగితే శరీరం డీహైడ్రేట్ బారిన పడకుండా ఉండడమే కాక అధిక చెమట పట్టకుండా ఉంటుంది.










